NEWSTELANGANA

ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమ‌లు చేయాలి

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డికి త‌న్నీరు హ‌రీశ్ రావు లేఖ

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని కోరారు.

ఒకవైపు రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతుంటే, మరోవైపు విషజ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై, ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని ఆవేద‌న చెందారు. ఇలాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన మీ ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ సెక్రెటరీ వరకు ఉన్న యంత్రాంగం మీద తీవ్ర ఒత్తిడి చేయ‌డం దారుణ‌మ‌న్నారు హ‌రీశ్ రావు.

పంచాయతీ సెక్రెటరీలు, బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిప‌డ్డారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం 15 వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడమంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు.

ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు.