రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
బావురుమంటున్న బాధితులు పట్టించుకోని అధికారులు
హైదరాబాద్ – హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చి వేసే పనిలో బిజీగా ఉంది. సీఎం ఆదేశాల మేరకు కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్ష చర్యలకు దిగారు. ఎవరి ఒత్తిళ్లకు తల వంచే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.
సోమవారం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కట్టుకున్న నిర్మాణాలు కూల్చి వేస్తున్నారంటూ బాధితులు బావురుమంటున్నారు. రాయదుర్గం లోని ప్రభుత్వ భూములలో 2, 3, 4, 5 సర్వే నెంబర్ లలో భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు.
దీనిని గుర్తించారు రెవిన్యూ, ఈడీ అధికారులు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ కు తెలుపడంతో వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. దీంతో బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. భవనాలను కూల్చి వేస్తుండడంతో బాధితులంతా రోడ్డుపైకి వచ్చారు.
తమకు ఎలాంటి నోటీసులు లేకుండానే రెవెన్యూ, జీహెచ్ఎంసీ బృందాలు కూల్చి వేతలకు పాల్పడుతున్నాయని నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నివాసితులు కూల్చి వేత డ్రైవ్‌ను అడ్డుకుంటున్నారు . అయితే అధికారులు ఎక్కడా తగ్గడం లేదు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో భారీ బందోబస్తు మధ్య కూల్చడం స్టార్ట్ చేశారు.