రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు – దగ్గుబాటి
భారతీయ జనతా పార్టీ ఏపీ స్టేట్ చీఫ్
అమరావతి – ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చుతోందంటూ వస్తున్న ప్రచరంపై స్పందించారు. సోమవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.
బీజేపీకి భారత రాజ్యాంగం పట్ల అపారమైన నమ్మకం, గౌరవం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదన్నారు. రాజ్యాంగానికి లోబడే తమ పార్టీ, కేంద్ర సంకీర్ణ ప్రభుత్వం (ఎన్డీయే) పని చేస్తుందని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి.
రిజర్వేషన్లు ఎత్తి వేయాలని తమ పార్టీ భావించ లేదని, ఆ దిశగా తాము ప్రయత్నం కూడా చేయలేదన్నారు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో ఉద్యమం చేపట్టిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంపూర్ణ మద్దతు కూడా తెలియ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు ఎంపీ.
అయితే కామన్ సివిల్ కోడ్ , ట్రిపుల్ తలాక్ వంటి వివాదాస్పద చట్టాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి.