NEWSTELANGANA

22న సెల‌వు ప్ర‌కటించండి

Share it with your family & friends

తెలంగాణ స‌ర్కార్ కు బండి

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 22న అయోధ్య లో శ్రీ‌రామ మందిరం పునః ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మం దేశ వ్యాప్తంగా పండుగ వాతావ‌ర‌ణంలో కొన‌సాగుతోంది. దీనిని పుర‌స్క‌రించుకుని ఈనెల 22న రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని కోరారు బండి సంజ‌య్ కుమార్.

రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురు చూస్తోంద‌న్నారు. దైవ కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని కోరారు. ఇది దేశానికే గ‌ర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు బంండి సంజ‌య్. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటార‌ని తెలిపారు.

ఇప్ప‌టికే ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెప్పారు. శుక్ర‌వారం బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇలాంటి అద్బుత కార్య‌క్ర‌మం అరుదుగా జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే శ్రీ‌రామ జ‌న్మ భూమి ట్ర‌స్టు 7,000 మంది ప్ర‌ముఖుల‌కు దేశ వ్యాప్తంగా ఆహ్వానాల‌ను పంపిణీ చేసింది. స్వ‌యంగా క‌లిసి అంద‌జేసింది. ఇందులో సినీ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, సిఇఓలు, చైర్మ‌న్లకు అంద‌జేసింది. అంతే కాకుండా క్రికెట‌ర్లు కూడా ఉన్నారు.