NEWSTELANGANA

మాపై క‌క్ష క‌ట్టారు – అక్బ‌రుద్దీన్ ఓవైసీ

Share it with your family & friends

కుతుబ్ మినార్ కంటే గొప్ప‌గా నిర్మిస్తాం

హైద‌రాబాద్ – ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బండ్లగూడ‌లో నిర్మించిన ఫాతిమా కాలేజీకి సంబంధించిన 12 భ‌వ‌నాల‌ను కూల్చి వేస్తారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించారు ఓవైసీ.

మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం కావాల‌ని త‌మ‌పై క‌క్ష క‌ట్టింద‌ని ఆరోపించారు అక్బ‌రుద్దీన్. త‌మ విద్యా సంస్థ‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని కూల్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

తాము 40 వేల మంది విద్యార్థుల‌కు ఉచితంగా విద్య‌ను అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు ఎంఐఎం ఎమ్మెల్యే. ఎవ‌రో కావాల‌ని త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, దీంతో హ్రైడ్రా దూకుడు పెంచుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అయినా అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఒక‌వేళ త‌న‌పై క‌క్ష గ‌నుక ఉంటే , త‌న‌పై దాడి చేయాల‌ని లేదా త‌న‌ను కాల్చి చంపాల‌ని కానీ పేద‌ల కోసం నిర్మించిన భ‌వ‌నాల‌ను కూల్చ వ‌ద్దంటూ అక్బరుద్దీన్ కోరారు. హైడ్రా ఏ ప్రాతిప‌దిక‌న కూల్చుతుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పూర్తిగా చ‌ట్ట విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఆరోపించారు ఓవైసీ.