DEVOTIONAL

టీటీడీలో 100 కోట్ల ముడుపులు తేల్చండి

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా

తిరుప‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో రూ. 100 కోట్ల ముడుపుల సంగ‌తి తేల్చాల‌ని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ చింతా మోహ‌న్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తిరుప‌తి లోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం ఎదుట ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా చింతా మోహ‌న్ హాజ‌రై ప్ర‌సంగించారు.

అలిపిరి సమీపంలోని దైవలోక్ కి కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేయాల‌ని, టిటిడిలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చింతా మోహ‌న్. డిప్యూటేషన్ విధానాలకు టిటిడి లో స్వస్తి పలకాలని అన్నారు. ఉద్యోగస్తులకే ప్రమోషన్లు ఇచ్చి, మంచి పోస్టులు ఇవ్వాలని కోరారు చింతా మోహ‌న్.

కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాల‌ని అన్నారు మాజీ ఎంపీ. విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, గోపి గౌడ్, శాంతి యాదవ్, తేజోవతి, ముని శోభ, రావణ్, వెంకటేష్ గౌడ్, గోపి తదితరులు పాల్గొన్నారు.