ఆక్రమించుకున్న భూములు ఇచ్చేయండి
లేకపోతే స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి
అమరావతి – ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎక్కువగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇవి పూర్తిగా పక్కదారి పట్టినట్లు ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఆక్రమణకు గురైన భూముల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని పురపాలిక సంఘాల పరిధిలో ఆక్రమణకు గురైన భూములు వెంటనే ఇచ్చేయాలని స్పష్టం చేశారు. లేక పోతే ప్రభుత్వమే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు పొంగూరు నారాయణ.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించు కోవడం, వాటిపై స్తంభాలు పాతడం, ఫెన్సింగ్ వేయడం ఒప్పుకోబోమని అన్నారు మంత్రి. తప్పక స్వాధీనం చేసుకుంటామని, వెంటనే ఆక్రమించుకున్న వారు, ఆక్రమణదారులు తమంతకు తామే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఆదేశించారు పొంగూరు నారాయణ.
ఇదిలా ఉండగా వచ్చే సెప్టెంబర్ నెల 13న 70 కొత్తగా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు.