NEWSTELANGANA

రాజ‌కీయ కుట్ర‌ల‌కు బ‌లి కావ‌ద్దు – సీఎం

Share it with your family & friends

నిరుద్యోగుల‌కు సూచించిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు మ‌ధ్య ద‌ళారీల మాట‌లు న‌మ్మ వ‌ద్ద‌ని సూచించారు. అంతే కాకుండా రాజ‌కీయ కుట్ర‌ల‌కు బ‌లి కావ‌ద్దంటూ కోరారు సీఎం.

విద్యార్థులు చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల‌ని, నిరుద్యోగులు జాబ్స్ ను ఎలా సాధించాల‌నే దానిపై క‌స‌ర‌త్తు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. అయితే నిరుద్యోగులు, విద్యార్థుల మేలు కోసం ఎవ‌రైనా, ఏ పార్టీకి చెందిన వారైనా కుల‌, మ‌తాల‌కు అతీతంగా త‌మ స‌ర్కార్ స‌ల‌హాలు , సూచ‌న‌లు తీసుకునేందుకు సిద్దంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు సీఎం.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. త‌మ స‌ర్కార్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన మాట ప్ర‌కారం జాబ్స్ ను భ‌ర్తీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం విద్యార్థుల‌ను, అభ్య‌ర్థుల‌ను, నిరుద్యోగుల‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు.

కానీ ద‌శ‌ల వారీగా చెప్పిన విధంగానే ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు రేవంత్ రెడ్డి. పూర్తి పార‌ద‌ర్శ‌క‌తతో కొలువులు నింపుతామ‌ని చెప్పారు.