NEWSTELANGANA

క‌విత‌కు బిగ్ రిలీఫ్ బెయిల్ మంజూరు

Share it with your family & friends

సీబీఐ, ఈడీ కేసుల‌లో ఎమ్మెల్సీకి ఊర‌ట

ఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో తీవ్ర వాదోప వాద‌న‌లు జ‌రిగాయి. క‌విత త‌ర‌పున ప్ర‌ముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాదించారు.

క‌విత ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా ఇదే కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చార‌ని , మ‌రి ఎందుకు క‌విత‌కు వ‌ర్తించ‌ద‌ని న్యాయ‌వాది ప్ర‌శ్నించారు. త‌ను ఎక్క‌డికీ పారి పోలేద‌ని దేశంలోనే ఉన్నార‌ని, ఈడీ, సీబీఐ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అందుబాటులో ఉన్నార‌ని వాదించారు.

అంతే కాకుండా ఒక మ‌హిళ‌గా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని, గైనిక్, వైర‌ల్ ఫీవ‌ర్ తో గ‌త కొంత కాలం నుంచీ బాధ ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. కేసులో 493 మందిని విచారించార‌ని, త‌ను 100 కోట్ల ముడుపులు తీసుకున్న‌ట్లు ఎక్క‌డా నిరూపించ లేక పోయారంటూ తెలిపారు ముకుల్ రోహ‌త్గీ.

క‌విత ఎక్క‌డా సాక్షుల‌ను బెదిరించ లేద‌ని, త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ తెలిపారు. జైల్లో ఉన్న అరుణ్ పిల్ళైపై ఎలా క‌విత ప్ర‌భావితం చేస్తారో మీరే చెప్పాల‌ని అన్నారు. పూర్తి వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఎట్ట‌కేల‌కు క‌విత‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.