రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్
కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు
ఢిల్లీ – భారతీయ జనతా పార్టీ రాజ్య సభ ఎన్నికలలో సత్తా చాటింది. మొత్తం ఆ పార్టీ 9 సీట్లకు పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి పెద్దల సభలో మరింత పట్టు లభించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పటికే లోక్ సభలో అంతంత మాత్రంగానే ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు వచ్చాయి.
దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలాన్ని చేజిక్కించు కోలేక పోయింది. తెలుగుదేశం , జనసేనతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతును కోరాల్సి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ సంకీర్ణ సర్కార్ మోడీ నేతృత్వంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయింది. మహారాష్ట్ర, బీహార్ లలో బీజేపీ మిత్రపక్షాలు ఎన్సీపీ, ఆర్ఎల్ఎం రెండు సీట్లు కైవసం చేసుకోగా , రాజస్థాన్ , మధ్యప్రదేశ్, బీహార్ , హర్యానా, అస్సాం, మహారాష్ట్ర లోని రాజ్య సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది.