త్వరలోనే వైఎస్సార్సీపీ ఖాళీ – లోకేష్
ఏలూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేరిక
అమరావతి – ఏపీ వైద్య, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉత్సుకత చూపిస్తున్నారని చెప్పారు.
ఇదిలా ఉండగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు.
వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు నారా లోకేష్.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీలో చేరే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. వైసీపీకి చెందిన వారు కలిసికట్టుగా ప్రభుత్వంతో భాగస్వామై ప్రజలకు సేవలు అందించాలని కోరారు.