NEWSTELANGANA

క‌విత క‌డిగిన ముత్యం కాదు – చామ‌ల

Share it with your family & friends

షాకింగ్ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని 166 రోజుల పాటు జైలు పాలై బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

ఏదో సాధించిన‌ట్లు త‌ను బ‌య‌ట‌కు వ‌చ్చి , నిర్దోషినంటూ చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. క‌ల్వ‌కుంట్ల క‌విత క‌డిగిన ముత్యం ఏమీ కాద‌న్నారు. బెయిల్ వ‌చ్చినంత మాత్రాన నిర్దోషి ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు కాంగ్రెస్ ఎంపీ.

బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఏదో జ‌రిగిన‌ట్లు సంబురాలు చేసుకోవ‌డం ప‌ట్ల విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇలాంటి సందేశం ద్వారా ఏం చెప్ప‌ద‌ల్చుకున్నారంటూ మండిప‌డ్డారు ఎంపీ చామ‌ల‌.

తెలంగాణ ప్రజలు సిగ్గుపడే విధంగా ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసింది కవిత అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . ముందు రోజే బిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఢిల్లీ చేరుకుని , మంతనాలు జరిపి, బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.