సీఎం మమతపై గవర్నర్ సీరియస్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించ లేదు
పశ్చిమ బెంగాల్ – రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా లేదా అన్న అనుమానం తనకు కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ . బుధవారం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన తెలియ చేసేందుకు వచ్చిన విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. ఆయన పోలీసుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడడం పట్ల ఫైర్ అయ్యారు. ఆయన పూర్తిగా ఖాకీల తీరు పట్ల మండిపడ్డారు.
ఇదిలా ఉండగా డాక్టర్ రేప్, మర్డర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. అంతే కాకుండా కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రస్తావించారు గవర్నర్. నిరసన తెలియ చేయడం, ఆందోళన చేపట్టడం పౌరుల ప్రాథమిక హక్కు అని, వారిని నిర్బంధించడం, అరెస్ట్ చేయడం, దాడులకు పాల్పడడం , భాష్ప వాయులను చేపట్టడం మంచిది కాదని పేర్కొందని తెలిపారు బోస్.
కాగా బీజేపీ స్టేట్ చీఫ్ సువేందు అధికారి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.