ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
అక్టోబర్ 3 నుంచి 12 దాకా కొనసాగుతాయి
విజయవాడ – విజయ దశమి పండుగను పురస్కరించుకుని మహోత్సవాలకు సిద్దమైంది ప్రసిద్ది చెందిన విజయవాడ లోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మ వారి ఆలయం. ఈ మేరకు ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. బుధవారం ఈ మేరకు మహోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై వచ్చే అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా అమ్మ వారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపింది.
అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 4వ తేదీన గాయత్రీ దేవిగా, 5న అన్నపూర్ణ దేవిగా, 6న లలితా త్రిపుర సుందరీ దేవీగా దర్శనం ఇస్తుందని తెలిపారు ఆలయ ఈవో.
అక్టోబర్ 7న మహా చండిగా , 8న మహా లక్ష్మి దేవిగా , 9న సరస్వతి దేవిగా, 10న దుర్గా దేవిగా, 11న మహిషా షుర మర్దనిగా, 12న రాజ రాజేశ్వరీ దేవిగా అమ్మ వారు దర్శనం ఇస్తారని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ముఖ్య కార్య నిర్వహణ అధికారి రామారావు చెప్పారు.