ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ గా శ్రీనివాసన్
నియమించిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని హోం శాఖ ఆధ్వర్యంలో కీలకంగా ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్ గా బి. శ్రీనివాసన్ ను నియమించింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కేబినెట్ నియామకాల కమిటీ బి. శ్రీనివాసన్ ను సిఫారసు చేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా ఆయన పదవీ కాలం 2027 ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని ఉత్తర్వులలో పేర్కొంది. ఇదిలా ఉండగా బి. శ్రీనివాసన్ ఐపీఎస్ 1992 బ్యాచ్ కు చెందిన అధికారి.
ఇదిలా ఉండగా బి. శ్రీనివాసన్ ప్రస్తుతం బీహార్ పోలీస్ అకాడెమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన విశిష్టమైన సేవలు అందించారు వృత్తి పరంగా. ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. నిబద్దత కలిగిన పోలీస్ ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు.
దేశ భద్రతా రంగంలో బ్లాక్ క్యాట్స్ అనే పేరు పొందింది ఎన్ ఎస్ జీ సంస్థకు. ఈ సంస్థ దేశ భద్రతా రంగంలో అత్యంత కీలకం కానుంది. ఉన్నతమైన సంస్థకు అత్యున్నతమైన పదవిని అలంకరించ బోతున్నారు బి. శ్రీనివాసన్.