NEWSNATIONAL

దేశ వ్య‌తిరేక పోస్టులు పెడితే జైలుకే

Share it with your family & friends

కొత్త పాల‌సీ తీసుకు వ‌చ్చిన సీఎం యోగి

ఉత్త‌ర ప్ర‌దేశ్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న సోష‌ల్ మీడియాపై ఉక్కు పాదం మోపేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎవ‌రైనా స‌రే త‌న‌కు గాను, త‌మ ప్ర‌భుత్వానికి గానీ, లేదా భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు కానీ, మోడీకి, షాకు వ్య‌తిరేకంగా ఎవ‌రు పోస్టులు పెట్టినా లేదా కామెంట్స్ చేసినా జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు యోగి ఆదిత్యా నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఇందులో భాగంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న సోష‌ల్ మీడియా విధానాన్ని ప్ర‌వేశ పెట్టింది. దేశ వ్య‌తిరేక పోస్టులకు పాల్ప‌డితే, లేదా అభిప్రాయాలు వ్య‌క్తం చేసినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఒక‌వేళ అలా చేస్తే జీవిత ఖైదు విధిస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం.

సోషల్ మీడియా ప్రభావితం చేసేవారి కోసం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడాన్ని కూడా పాలసీ ప్రోత్సహిస్తుంది. ట్విట్ట‌ర్ , ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ త‌దిత‌ర వాటిల‌లో గ‌నుక వ్య‌తిరేకంగా పోస్టులు పెడితే జైలు శిక్షతో పాటు రూ. 5 ల‌క్ష‌లు, రూ. 4 ల‌క్ష‌లు , రూ. 3 ల‌క్ష‌లు జ‌రిమానా విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతే కాదు యూట్యూబ్ లో కూడా వీడియోలు షేర్ చేసినా లేదా అప్ లోడ్ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు.