NEWSTELANGANA

సీఎం సోద‌రుడికి షాక్ నోటీసులు జారీ

Share it with your family & friends

దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు ఝ‌ల‌క్

హైద‌రాబాద్ – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అక్ర‌మ నిర్మాణాల‌పై కొర‌డా ఝులిపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోద‌రుడు ఎ. తిరుప‌తి రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. దుర్గం చెరువు ప‌రిధిలో ఆక్ర‌మించుకుని భ‌వ‌న నిర్మాణాలు చేప‌ట్టిన ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా సీఎం సోదరుడికి సైతం నోటీసు ఇచ్చింది హైడ్రా.

ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి సోద‌రుడి నివాసంతో పాటు ఆఫీసుతో స‌హా ప‌లు ప్ర‌ముఖ నిర్మాణాల‌పై దృష్టి సారించింది . మాదాపూర్ అమ‌ర్ కో ఆప‌రేటివ్ సొసైటీ ప‌రిధిలోని ఆస్తుల‌పై ఫోక‌స్ పెట్టింది. అంతే కాకుండా ఇంకా నిర్మాణాలు చేప‌ట్టని వాటిపై కూడా చ‌ర్య‌లు చేప‌ట్టింది హైడ్రా. వాట‌న్నింటిని 30 రోజుల్లో తొల‌గించాల‌ని ఆదేశించింది నోటీసులో.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా ఇదే విధంగా నోటీసులు జారీ చేశారు.

వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు జారీ చేశారు. ఆక్ర‌మించిన నిర్మాణాల‌ను నిర్ణీత గ‌డువు లోగా కూల్చి వేయాల‌ని లేక పోతే అధికారులే స్వ‌యంగా కూల్చి వేస్తారంటూ హెచ్చ‌రించారు హైడ్రా క‌మిష‌న‌ర్. ఒక్క రోజే వంద‌లాది ఇళ్లు, వాణిజ్య స‌ముదాయాల‌కు నోటీసులు అంద‌జేయ‌డం క‌ల‌కలం రేపుతోంది.