తెలుగు భాషా ప్రేమికుడు హరికృష్ణ
ఆగస్టు 29న ఆయన వర్దంతి
అమరావతి – నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ వర్దంతి ఇవాళ. ఆయన నటుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు రాజకీయ పరంగా ప్రత్యేకతను చాటుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.
దివంగత నటుడు, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు తనయుడిగా, బాలకృష్ణకు అన్నగా నందమూరి హరికృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవడంలో కీలక పాత్ర పోషించారు దివంగత ఎన్టీఆర్.
నటనా పరంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందారు ఎన్టీఆర్. ఇదే సమయంలో ఊహించని రీతిలో 1983లో తాను తెలుగుదేశం పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కడే పర్యటించాడు. లక్షలాది ప్రజలను చైతన్యవంతం చేశారు. చైతన్య రథం పేరుతో ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్బంగా తన తండ్రి వెంట ఉంటూ, చైతన్య రథంకు రథ సారథిగా ఉన్నాడు నందమూరి హరికృష్ణ. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆగస్టు 29న ఆయన మృతి చెందారు. ఇవాళ ఆయన వర్దంతి సందర్బంగా నందమూరి కుటుంబం నివాళులు అర్పించింది. హరికృష్ణ తనయుడే జూనియర్ ఎన్టీఆర్.