వైసీపీకి షాక్ ఎంపీ పదవికి గుడ్ బై..?
మోపిదేవి వెంకట రమణారావు వెల్లడి
ఢిల్లీ – వైఎస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. నిన్న ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు పోతుల సునీత. ఆమె బాటలోనే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణా రావు తన రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది.
ఇదిలా ఉండగా ఢిల్లీకి చేరుకున్న వెంకట రమణా రావు రాజ్యసభ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కు తన రాజీనామా లేఖ అందజేశారు. అనంతరం వైసీపికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లేఖను పార్టీ హై కమాండ్ కు పంపించారు.
అనంతరం ఢిల్లీ నుంచి విమానంలో నేరుగా సాయంత్రం విజయవాడకు చేరుకుంది. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు గాను ఆగస్టు 30న గురువారం బాపట్ల జిల్లా రేపల్లెకు బయలుదేరి వెళతారు.
తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు మోపిదేవి వెంకట రమణా రావు.
కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులు, వివిధ సామాజిక వర్గాల అభిప్రాయం తీసుకున్న తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది చర్చనీయాంశంగా మారింది.