ఏపీ సీఎంతో బ్రిటీష్ హైకమిషనర్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు
అమరావతి – బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెట్ విన్ ఓవెన్ మర్యాద పూర్వకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం, కమిషనర్ ల మధ్య చర్చలు జరిగాయి. గంటకు పైగా ఈ ఇద్దరు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐటీ, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ది , పరిశ్రమల ఏర్పాటు, ఏపీ విజన్, ఆటోమొబైల్స్ పరిశ్రమల స్థాపన, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు నారా చంద్రబాబు నాయుడు, గారెట్ విన్ ఓవెన్.
అంతే కాకుండా హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ సైన్స్, టెక్నాలజీ వంటి కీలక రంగాలలో అవకాశాల గురించి కూడా ప్రస్తావించారు సీఎం.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే దృష్టి సారిస్తామన్నారు .
తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటీష్ ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందించాలని నారా చంద్రబాబు నాయుడు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెట్ విన్ ఓవెన్ కు విన్నవించారు .