ఏపీ అభివృద్ది కోసం సూచనలు ఇవ్వండి
పిలుపునిచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్
అమరావతి – ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర అభివృద్ది కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని ఏపీ వైద్య, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఇందులో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, పురోభివృద్దికి పాటు పడే వారి కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు నారా లోకేష్.
ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్న వారి నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా హైదరాబాదులో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని లోకేశ్ వివరించారు. మానవ వనరులు, మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రణాళిక రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వంతో కలిసి నడవాలని ఏపీ ఈడీబీ (ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్)ని కోరుతున్నామని తెలిపారు.