NEWSTELANGANA

హైకోర్టు కామెంట్స్ పై సీఎస్ స‌మీక్ష

Share it with your family & friends

భ‌వ‌న నిర్మాణాలు కూల్చేస్తే ఎలా..

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడు పెంచ‌డం, అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చి వేయ‌డంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కేవ‌లం ఒక వ‌ర్గానికి చెందిన వారివే ఎలా కూల్చి వేస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇదే స‌మ‌యంలో అక్ర‌మ నిర్మాణాలు కూల్చే ముందు సంబంధిత వ్య‌క్తుల‌కు ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌డమో లేదా నోటీసులు జారీ చేయ‌డమో చేయాల‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.

హైడ్రా కొంచెం స్పీడ్ త‌గ్గిస్తే మంచిద‌ని స‌ల‌హా ఇచ్చింది. దీంతో హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసిన నేప‌థ్యంలో రంగంలోకి దిగారు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి. బుధ‌వారం స‌చివాల‌యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల, వీఅండ్‌ఈ, ఏసీబీ, పోలీసు తదితర శాఖల అధికారులతో స‌మీక్ష చేప‌ట్టారు.

చట్ట విరుద్ధమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే ముందు హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సంద‌ర్బంగా హైడ్రాతో పాటు ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల స‌ర్కార్ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఎవ‌రి మాట వినే ప్ర‌స‌క్తి లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.