DEVOTIONAL

తిరుమ‌ల ల‌డ్డూ పంపిణీపై అపోహ‌లు వ‌ద్దు

Share it with your family & friends

టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి

తిరుమ‌ల – ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో ల‌డ్డూ పంపిణీపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారంపై స్పందించారు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తిరుమ‌ల ప్ర‌సాదం ల‌డ్డూపై అనేక ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని పేర్కొన్నారు. ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత భ‌క్తుడికి ఒక ఉచిత ల‌డ్డూతో పాటు 5 నుంచి 6 ల‌డ్డూల వ‌ర‌కు ఇస్తున్నామ‌ని చెప్పారు.

దర్శనం చేసుకోకుండానే చాలా మంది లడ్డూలు తీసుకొని బ్లాక్ లో విక్రయిస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. దానిని అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు వెంక‌య్య చౌద‌రి.

ఆధార్ లింకు ద్వారా రెండు ల‌డ్డూలు ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల బ్లాక్ మార్కెట్ ను అరిక‌ట్ట వ‌చ్చ‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు టీటీడీ అద‌న‌పు ఈవో. అందుకే ఈ పాల‌సీని తీసుకు వ‌చ్చామ‌ని, భ‌క్తుల సౌక‌ర్యాల‌కు ప్ర‌యారిటీ త‌మ‌కు ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. ల‌డ్డూల పంపిణీపై త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని ఆయ‌న కోరారు.