NEWSANDHRA PRADESH

న‌టి జ‌త్వానీ కేసుపై విచార‌ణ‌ అధికారి – అనిత‌

Share it with your family & friends

ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి ప్ర‌క‌టన‌

అమ‌రావ‌తి – సినీ, రాజ‌కీయ రంగాలలో క‌ల‌కలం సృష్టించిన న‌టి కాదంబ‌రి జ‌త్వానీ కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. విచార‌ణ నిమిత్తం ఆమెను విజ‌య‌వాడ‌కు తీసుకు వ‌చ్చారు పోలీసులు. ఈ సంద‌ర్బంగా కాదంబ‌రి జ‌త్వానీ తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాని, లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాన‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వానికి చెందిన నేతలు కొంద‌రు త‌న‌ను టార్చ‌ర్ కు గురి చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జ‌త్వానీ. దీంతో రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. విచార‌ణ‌కు ఆదేశించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.

ముంబై న‌టి జ‌త్వానీ ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశార‌ని చెప్పారు. విచార‌ణ కోసం మ‌హిళా అధికారిని నియ‌మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు . త‌ప్పు చేసిన‌ట్లు తేలితే అధికారుల‌ను సైతం వ‌దిలి పెట్ట‌బోమంటూ హెచ్చ‌రించారు వంగ‌ల‌పూడి అనిత‌. అయితే దిశ అనే చ‌ట్ట‌మే ఇంత వ‌ర‌కు లేద‌న్నారు. ఇక నుంచి దిశ పీఎస్ ల‌ను మ‌హిళా పోలీస్ స్టేష‌న్ లుగా వినియోగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.