ఏపీ దేవాలయాల్లో హిందువులకే జాబ్స్
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి రాష్ట్రంలోని హిందూ దేవాలయాలలో కేవలం హిందువులకే జాబ్స్ ఇస్తామని వెల్లడించారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలంలో హిందూయేతర వ్యక్తులకు ప్రయారిటీ ఇచ్చారని, వారికి టెండర్లలో అవకాశం కల్పించారని, ఉద్యోగాలలో కూడా నియమించారని ఆరోపించారు. దీంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అంతే కాకుండా పూజారుల పట్ల, ఆలయ కమిటీల పట్ల వివక్షను ప్రదర్శించారని, కొన్ని చోట్ల దాడులకు దిగారని మండిపడ్డారు ఏపీ సీఎం.
దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైందని, హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని తమ దృష్టికి ఫిర్యాదులు అందాయని, దీంతో తమ ప్రభుత్వం హిందువులకే జాబ్స్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇక నుంచి ఆలయ అర్చకులకు వేతనాలు పెంచుతామని ప్రకటించారు.