అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన మంత్రి దాసరి సీతక్క
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహిళా , శిశు సంక్షేమ శాఖపై ఆమె సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల పనితీరుపై ఆరా తీశారు. మరింత పనితీరు మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడీ టీచర్లతో పాటు పని చేస్తున్న ఆయాలకు కూడా వేతనాలు పెంచడం జరిగిందని స్పష్టం చేశారు.
అయినా విధుల పట్ల అలసత్వం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు దాసరి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలలో పూర్తి వివరాలు ఉండాలని, పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు దాసరి సీతక్క. అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంగన్వాడీల్లో నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు సీతక్క. వచ్చే నెల 4 నుంచి జిల్లాలలో పర్యటిస్తానని ప్రకటించారు మంత్రి.