చెరగని సంతకం పరిటాల రవి జీవితం
అలుపెరగని అరుదైన నేతకు నివాళి
అమరావతి – తెలుగు రాజకీయ చరిత్రలో చెరిగి పోని సంతకం దివంగత నేత పరిటాల రవీంద్ర అని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎక్కడ అన్యాయం జరిగినా తను పోరాటం చేశాడని , ఆయన జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచిందని పేర్కొన్నారు.
ప్రత్యేకించి సామాన్యులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పాటు పడ్డాడని కొనియాడారు . చివరి క్షణం దాకా పోరాడిన నిలువెత్తు సిద్దాంతం పరిటాల రవీంద్ర అని ప్రశంసించారు. ప్రజా జీవితంలో ఇలాంటి నాయకులు అరుదుగా పుడతారని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
లెక్కించ లేనంత అభిమానులను సంపాదించుకున్న గొప్ప నాయకుడు పరిటాల రవీంద్ర అని తెలిపారు. ఆగస్టు 30న పరిటాల జయంతి. ఈ సందర్బంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో పరిటాల రవీంద్ర పేరు చెబితే చాలు పేదలు ఇప్పటికీ తలుచుకుంటారని గుర్తు చేశారు. అక్రమార్కుల గుండెల్లో , అవినీతి పరులను ఆట కట్టించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజా నాయకుడిగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు మంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.
పరిటాల రవీంద్ర వ్యక్తి కాదని ఆయన ఓ శక్తి అని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.