NEWSANDHRA PRADESH

ఏపీలో జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

Share it with your family & friends

మంత్రి నారా లోకేష్ కు జ‌ర్న‌లిస్టు సంఘం నేత విన‌తి

విశాఖ‌ప‌ట్నం – రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను. వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కోరినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

రెండు రోజుల నగర పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ ను శుక్రవారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్ లో గంట్ల శ్రీనుబాబు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తొలుత లోకేష్ కు సింహాద్రినాధుడు జ్ఞాపికను బహుకరించారు.

అనంతరం జర్నలిస్ట్ ల పెండింగ్ సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు .రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలతో పాటు ఇతర రాష్ట్రాల మాదిరిగా పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరడం జరిగిందని శ్రీనుబాబు చెప్పారు.

అంతేకాకుండా అక్రిడేషన్, అటాక్స్ తో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు అంద జేయాలని కోరామ‌ని తెలిపారు.

గతంలో మాదిరిగా ప్రమాద బీమా పాలసీని కూడా వెంటనే పునరుద్ధరించాలని, త‌దిత‌ర అంశాల‌తో వినతి పత్రం మంత్రి లోకేష్ కు అంద‌జేశామ‌న్నారు. దీనిపై స్పందించిన మంత్రి వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు.