ఇంజనీరింగ్ విద్యార్థినులకు సీఎం భరోసా
నీకు నేనున్నా అధైర్య పడవద్దంటూ హామీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులకు పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధైర్య పడవద్దని సూచించారు.
మీకు నేను పూర్తి భరోసా ఇస్తున్నానని స్పష్టం చేశారు సీఎం. మీ అందరికీ పూర్తి భద్రత కల్పించడం తమ ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. అనంతరం మీడియాతో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు.
విచారణకు ఆదేశించడం జరిగిందని, దోషులు ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు . ఇందులో ఎవరూ అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం. తప్పు చేసిన వారు తేలితే వెంటనే శిక్ష పడేలా చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా మంత్రి కొల్లు రవీంద్ర గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతానికి వెళ్లారు. ఆందోళన చేపట్టిన విద్యార్థినులతో మాట్లాడారు. నిరసన విరమించాలని కోరారు. విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు పూర్తి సెక్యూరిటీ క్పలిస్తామన్నారు. ఎవరినీ వదల బోమంటూ పేర్కొన్నారు మంత్రి.