ANDHRA PRADESHNEWS

రేపే ముహూర్తం ష‌ర్మిల ప్ర‌మాణం

Share it with your family & friends

ఏపీ పీసీసీ చీఫ్ గా నియామ‌కం

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ గా నియ‌మితులైన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఈనెల 21న విజ‌య‌వాడ‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ మేర‌కు పార్టీ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. ఏఐసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏపీలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారి పోయాయి.

వైఎస్ ష‌ర్మిల స్వ‌యాన ఏపీ సీఎం జగ‌న్ మోహ‌న్ రెడ్డికి సోద‌రి . దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కూతురు. బ్రద‌ర్ అనిల్ కుమార్ తో క‌లిసి వైఎస్ ష‌ర్మిల ఇటీవ‌లే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీల స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ నిర్ణ‌యాన్ని ఎవ‌రూ ఊహించ లేదు. ప్ర‌త్యేకించి జ‌గ‌న్ రెడ్డి. ఏపీలో పార్టీ కోల్పోయిన ప‌రువును తిరిగి నిల‌బెట్టాల‌ని వ్యూహాత్మ‌కంగా ఏఐసీసీ హైక‌మాండ్ పావులు క‌దిపింది. చివ‌ర‌కు ష‌ర్మిల‌కు బిగ్ ఛాన్స్ ఇచ్చింది. అంత‌కు ముందు ఆమె తెలంగాణ రాజ‌కీయాల‌లో కీల‌క పాత్ర పోషించారు. 3 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేప‌ట్టారు.

చివ‌ర‌కు తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోవడం లేదంటూ ప్ర‌కటించారు. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని హ‌స్తంలో విలీనం చేస్తున్న‌ట్లు తెలిపారు.

వలసదారులకు జర్మనీ శుభవార్త చెప్పింది. దేశ పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షల సడలింపు దిశగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన ప్రణాళికను చట్టసభ్యులు ఆమోదించారు.

ఈ సంస్కరణలు వలసదారుల ఏకీకరణను ప్రోత్సహిస్తాయని, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత చట్టం ప్రకారం జర్మనీలో ఎనిమిదేళ్లు నివసిస్తేనే పౌరసత్వం పొందేందుకు అర్హులు. ప్రత్యేక సందర్భాల్లో ఐదేళ్లకు అవకాశం కల్పిస్తారు. తాజాగా దీన్ని ఐదేళ్లు, మూడేళ్లకు తగ్గించారు.