ENTERTAINMENT

జెత్వానీ కామెంట్స్ బ‌క్వాస్ – విద్యాసాగ‌ర్

Share it with your family & friends

ఆమె చెప్పేవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

అమ‌రావ‌తి – రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ముంబై న‌టి కాదంబ‌రి జెత్వానీ కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. ఆమె వైసీపీ నేత కుక్క‌ల విద్యాసాగ‌ర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌ను వైసీపీ సీనియ‌ర్ నేత‌లు దారుణంగా హింసించార‌ని వాపోయింది. న‌టి జెత్వానీ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఏపీ స‌ర్కార్ సీరియ‌స్ గా స్పందించింది. ఈ మేర‌కు విచార‌ణ‌కు ఆదేశించారు డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావు. ఆమెను ముంబై నుంచి విచార‌ణ నిమిత్తం ఏపీకి ర‌ప్పించారు.

ఈ సంద‌ర్బంగా త‌న‌పై కాదంబ‌రి జెత్వానీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు వైసీపీ నేత కుక్క‌ల విద్యాసాగ‌ర్. ఆమె చెప్పేవ‌న్నీ పూర్తి అబ‌ద్దాలంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు.

తాను ముంబైలో వ్యాపారం చేస్తున్నప్పుడు జెత్వానీ ప‌రిచ‌యం అయ్యింద‌న్నారు. అప్ప‌ట్లో న‌టి కాబ‌ట్టి ఫోటోలు మాత్ర‌మే దిగాన‌ని చెప్పారు. 2014 నుంచి జెత్వానీ త‌న‌నుల‌ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు..

ఆమె చూపిస్తున్న అర్ధనగ్న ఫొటో త‌న‌ది కాద‌న్నారు కుక్క‌ల విద్యాసాగ‌ర్. మార్ఫింగ్ చేసి బెదిరించ‌డం జెత్వానీకి అల‌వాటు అని మండిప‌డ్డారు.