NEWSANDHRA PRADESH

అల్ప పీడ‌నం జ‌ర భ‌ద్రం – కూర్మ‌నాథ్

Share it with your family & friends

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా వ‌ర్షాలు కురిసే ఛాన్స్

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్ప పీడ‌నం ఏర్ప‌డింద‌ని, దీని కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని డైరెక్ట‌ర్ కూర్మ‌నాథ్ వెల్ల‌డించారు. శ‌నివారం ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అల్ప పీడ‌నంఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు.

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో కూడా ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తాయ‌ని అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు కూర్మ‌నాథ్.

కాగా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌న్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయ‌ని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు రోణంకి కూర్మ‌నాథ్.