కోటి మొక్కలు నాటడం లక్ష్యం – పవన్
ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వనమహోత్సవం కార్యక్రమం భారీ ఎత్తున ప్రారంభమైంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ నాటిన మొక్కలు రేపటి రోజున చెట్లు అవుతాయని, ఎందరికో నీడను ఇస్తాయని అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల. అటవీ శాఖా పరంగా కోటి మొక్కలకు పైగా నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు డిప్యూటీ సీఎం.
రాష్ట్రంలో పచ్చదనాన్ని 29 నుంచి 50 శాతానికి తీసుకు వెళతామని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు . గత వైసీపీ ప్రభుత్వం పర్యావరణాన్ని దెబ్బ తీసిందని ఆరోపించారు. చెట్లను అకారణంగా తొలగించిందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఇవాళ నాటే ప్రతి మొక్క భావి తరాల కోసమేనని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
మొక్కలు నాటడాన్ని ఓ యజ్ఞంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ప్రకృతిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా హరిత హారంతో పచ్చదనంతో వెల్లి విరియాలని అన్నారు డిప్యూటీ సీఎం.