ఎమ్మెల్యేగా ఉన్నా బైరెడ్డిదే పెత్తనం
అర్ధర్ సంచలన కామెంట్స్ కలకలం
నందికొట్కూర్ – ఏపీలో ఎన్నికల వేళ అధికారంలో ఉన్న వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ఎంపీ బాలశౌరి గుడ్ బై చెప్పారు. జనసేన చీఫ్ తో కలిశారు. తాజాగా ఇదే పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నందికొట్కూర్ ఎమ్మెల్యే అర్థర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు , ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పేరుకే తాను ఎమ్మెల్యేనని కానీ పెత్తనమంతా బైరెడ్డిదేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఇదే విషయంపై నిలదీసినందుకు తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారని ఆరోపించారు అర్థర్. రాష్ట్రంలోని దళీత నియోజకవర్గాలలో ఇదే కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
పార్టీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశానని, ఎమ్మెల్యేగా పవర్స్ ఇస్తేనే టికెట్ ఇవ్వండి లేకపోతే వద్దని స్వయంగా చెప్పానని అన్నారు. నాలుగేళ్లుగా మిమ్మల్నే నమ్ముకున్నానని తెలిపానని చెప్పారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ను తాననని కానీ ఎక్కడా తన పేరంటూ ఉండదన్నారు. డిసెంబర్ 2022లో సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసి ఇదే విషయం చెప్పానని తెలిపారు.