వర్షంలో సైతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
సీఎం ఆదేశాల మేరకు అందజేత
అమరావతి – ఓ వైపు ఏపీ రాష్ట్రంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉద్యోగులు, సిబ్బంది తెల్లవారుజాము నుంచే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. అవ్వ తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్దులు ఇబ్బంది పడకుండా నేరుగా వారి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి వారి వివరాలు సేకరించి పెన్షన్లు ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం సెలవు రోజు కావడంతో పెన్షన్ దారులు ఇబ్బంది పడకుండా కొత్త నెల రాకుండానే ఆగస్టు 31న పెన్షన్లు పూర్తిగా పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
లబ్దిదారులు ఇబ్బందులకు లోను కాకుండా ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ చేయడం విశేషం. దీంతో వృద్దులు, ఒంటరి మహిళలు, వికలాంగులు , మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ వర్షంలోనూ ఉదయం 9 గంటల వరకే 63 శాతానికి పైగా పెన్షన్లు పంపిణీ చేశారు ఉద్యోగులు.