కాంగ్రెస్ ప్రభుత్వం పేదళ ఇళ్లపై ప్రతాపం
ఇంకానా ఇకపై చెల్లదంటున్న శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కావాలాని కూల్చుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. శనివారం వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రోజూ కూలీ చేసుకుని బతికే నిరుపేదల ఇళ్లను కూల్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కనీసం మానవత్వం అన్నది మరిచి పోయి కూల్చడం దారుణం అన్నారు. ఓ వైపు భారీ వర్షాలు వస్తున్నా ఎలాంటి ముందస్తు సమాచారం , హెచ్చరిక, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించారు వి. శ్రీనివాస్ గౌడ్.
తమ వస్తువులను తీసుకుంటామని వేడుకున్నా, ప్రాధేయ పడినా కనికరించ లేదని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చే అధికారం మీకు ఎవరిచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు మాజీ మంత్రి.
400 మంది పోలీసులతో అర్ధరాత్రి పేదల ఇళ్ల వద్దకు వెళ్లారని, వారిని భయ భ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఏదో ఒక రోజు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.