శ్రీశైలంకు వరద ఉధృతి..విద్యుత్ ఉత్పత్తి
భారీ వర్షం నిండు కుండలా జలాశయం
కర్నూలు జిల్లా – వాయవ్య బంగళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరుతుండడంతో అధికారులు 9 గేట్లు ఎత్తేశారు. 10 అడుగుల మేర నీటిని దిగువకు వదిలారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ ఫ్లో 3,27,610 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3,21,077 క్యూసెక్కులు గా ఉంది.
పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 885.00 అడుగులు ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 215.8070 టీఎంసీలుగా ఉంది.
భారీ ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ఉధృతి కారణంగా నిండడంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.