హైడ్రా జగన్ రెడ్డిపై కొరడా
నోటీసులు జారీ చేసిన కమిషనర్
హైదరాబాద్ – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న లోటస్ పాండ్ ను చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్లు అధికారులు ఆరోపించారు. ఈమేరకు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాడేపల్లిగూడెం లేదా బెంగళూరులో ఉంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. తన భార్య పేరు మీద సాక్షి పేపర్, ఛానల్ ను నిర్వహిస్తున్నారు.
గతంలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అక్రమంగా లెక్కకు మించి ఆస్తులు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. పాదయాత్ర చేపట్టారు. ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం పలు కేసులు ఆయనను వెంటాడుతున్నాయి.
ఈ తరుణంలో చంద్రబాబు శిష్యుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి కావడంతో బాబు ఆదేశాల మేరకు జగన్ రెడ్డి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేశారన్న విమర్శలు లేక పోలేదు.