NEWSANDHRA PRADESH

సీఎం స‌మీక్ష జ‌ర జాగ్ర‌త్త

Share it with your family & friends

భారీ వ‌ర్షాల కార‌ణంగా వాయిదా

అమ‌రావ‌తి – ఏపీలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌పై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. శ‌నివారం సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు.

ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్నారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు.

ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు సీఎం. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోందని దానిపై దృష్టి పెట్టాల‌న్నారు.

వర్షాలు, వరదల కారణంగా తాగు నీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంద‌ని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.

కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచే యాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని సూచించారు. వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పని చేయాలన్నారు.

క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాల‌ని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు.