జగన్ మాఫియా టార్చర్ పెట్టింది – జెత్వానీ
ముంబై నటి కాదంబరి సంచలన కామెంట్స్
అమరావతి – ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను కావాలని టార్చర్ పెట్టారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై.
జగన్ మోహన్ రెడ్డి మాఫియా పెట్టిన హింసపై ఏకరువు పెట్టారు. మీడియా ముందు కంటతడి పెట్టారు. తనను ఆనాడు ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు నటి జెత్వానీ.
అప్పటి విజయవాడ కమిషనర్ ఆధ్వర్యంలో అక్రమ కేసు తనపై బనాయించారంటూ వాపోయారు. దాదాపు 15 మంది పోలీసు అధికారులు తనను కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు ముంబై నటి కాదంబరి జెత్వానీ.
ఇందుకు సంబంధించి పూర్తి వాస్తవాలు బయటకు రావాలని కోరారు. తాను తన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు.
ఒక డాక్టర్ గా, ఒక యాక్టర్ గా, ఈ స్థాయికి రావటానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు జెత్వానీ. ఇప్పుడు నా పై వ్యక్తిత్వ హననం చేయటం బాధగా ఉందన్నారు.