క్రీడాకారుల కంటే రైతన్నలు గొప్పోళ్లు
రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్ కామెంట్స్
హర్యానా – ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పంజాబ్ – హర్యానా శంభు సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. వారికి తన వంతు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ దేశానికి అన్నం పెట్టేది రైతులు అని, క్రీడాకారులు కాదన్నారు.
క్రీడాకారులు, ఆటగాళ్ల కంటే అన్నదాతలు గొప్పోళ్లని వాళ్లు లేక పోతే మనందరం ఆకలితో చచ్చి పోతామని అన్నారు. ఇకనైనా పాలకులు రైతుల గురించి ఆలోచించాలని అన్నారు. ఇదిలా ఉండగా తనకు ఖాప్ పంచాయతీ బంగారు పతకాన్ని అందించింది. ఈ సందర్బంగా తనకు బంగారు పతకం కంటే రైతులే ముఖ్యమని స్పష్టం చేశారు వినేశ్ ఫోగట్.
ఇదంతా చూసి నేను బాధపడ్డాను. వారు ఇక్కడ కూర్చుని 200 రోజులు అయ్యింది. వారు ఈ దేశ పౌరులు” అని ఆమె అన్నారు. వారు దేశాన్ని నడుపుతారు. వారు లేకుండా ఏదీ సాధ్యం కాదు, క్రీడాకారులు కూడా కాదు – వారు మాకు ఆహారం ఇవ్వకపోతే, మేము పోటీ పడలేం అని చెప్పారు వినేష్ ఫోగట్.
నేను క్రీడాకారిణి కంటే ముందు రైతు బిడ్డను . నాకు బాధ్యత ఉందన్నారు రెజ్లర్. దౌర్జన్యాలు, విషాదాలు, పోరాటం మనల్ని మనుషులుగా దగ్గర చేస్తాయి అని అన్నారు .