NEWSTELANGANA

ఆరుగురు అధికారుల‌పై క్రిమిన‌ల్ కేసులు

Share it with your family & friends

బిగ్ షాక్ ఇచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్

హైద‌రాబాద్ – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారికి నోటీసులు జారీ చేశారు. ఇదే స‌మ‌యంలో చెరువ‌ల్లో క‌ట్ట‌డాల‌కు అనుమ‌తులు ఇచ్చిన అధికారుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇందుకు సంబంధించి ప్ర‌స్తుతానికి ఆరుగురు అధికారుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు. సైబరాబాద్ EOW వింగ్‌లో కేసులు నమోదు చేశారు సీపీ అవినాష్ . ఇందులో భాగంగా నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసు నమోదు చేశారు. చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్‌, బాచుపల్లి MRO పూల్‌ సింగ్‌పై కేసు న‌మోదు చేశారు.

అంతే కాకుండా మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై కూడా కేసు న‌మోదు చేయ‌డం విశేషం. వీరితో పాటు హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీస‌ర్ సుధీర్ కుమార్ , సిటీ ప్లాన‌ర్ రాజ్ కుమార్ ల‌పై కేసు న‌మోదు చేశారు .

హైడ్రా సిఫార్సు మేర‌కు వీరిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు సీపీ అవినాష్. ఇదిలా ఉండ‌గా ఎఫ్టీఎల్ లో అనుమ‌తులు ఇచ్చిన వారిపై కూడా కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.