ENTERTAINMENT

ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ బోర్డు అడ్డంకి

Share it with your family & friends

షాకింగ్ కామెంట్స్ చేసిన కంగ‌నా ర‌నౌత్

ఢిల్లీ – ప్ర‌ముఖ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ప్ర‌ధాన మంత్రి , దివంగ‌త ఇందిరాగాంధీ హ‌యాంలో విధించిన ఎమ‌ర్జెన్సీ ఆధారంగా తెర కెక్కించిన ఎమ‌ర్జెన్సీ సినిమాలో ఇందిర పాత్ర‌లో త‌ను న‌టించింది. ఈ సంద‌ర్బంగా త‌న ఎమ‌ర్జెన్సీ సినిమా ఇంకా విడుద‌ల కాక పోవ‌డానికి గ‌ల కార‌ణాల గురించి స్పందించింది కంగనా రనౌత్.

త‌న సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని వాపోయింది న‌టి, ఎంపీ. విచిత్రం ఏమిటంటే ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంద‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సార్ బోర్డు క్లారిటీ ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది కంగ‌నా ర‌నౌత్.

తాము సీబీఎఫ్సీ నుండి అన్ని అనుమ‌తులు తీసుకున్నామ‌ని, కానీ సినిమా ఎందుక‌నో అక‌స్మాత్తుగా ఆగి పోయింద‌ని వాపోయారు. దీనిపై ప‌లు అనుమానాలు త‌న‌కు ఉన్నాయంటూ పేర్కొన్నారు న‌టి.

“వారు ఇందిరా గాంధీ హత్య, భింద్రావాలా, పంజాబ్ అల్లర్లను చూపించాలని కోరుకోవడం లేదు. ఏమి చూపించాలో నాకు తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కంగ‌నా ర‌నౌత్.