NEWSTELANGANA

జ‌గ‌న్ కు హైడ్రా నోటీసులు ఇవ్వ‌లేదు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధించి తాజాగా నోటీసులు ఇచ్చిన‌ట్లు, లోట‌స్ పాండ్ రూల్స్ కు విరుద్దంగా క‌ట్టిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు.

తాము ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వ లేద‌ని పేర్కొన్నారు. హైదరాబాద్‎లోని జగన్ లోటస్ పాండ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని…త్వరలోనే హైడ్రా లోటస్ పాండ్‎ను కూల్చేస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరగ‌డం త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఏవీ రంగ‌నాథ్.

ఈ క్రమంలో వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

జగన్ కు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామని.. దానిని ఎవరూ నమ్మొద్దని సూచించారు. హైడ్రా ఇట్లాంటి నోటీసులు ఇవ్వదని.. అక్రమణ అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తోందని ప్ర‌క‌టించారు.