ప్రతీకార చర్యలకు పాల్పడితే ఎలా ..?
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డితో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వైద్య, విద్యా సంస్థలకు NTR పేరు తొలగించి మాజీ సీఎం జగన్ అనాడు పెద్ద తప్పు చేశారని ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత సీఎం చంద్రబాబు తప్పు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు,ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి YSR పేరు తొలగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఈ మొత్తం చర్యలను కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అయినా, వైఎస్సార్ అయినా ఉమ్మడి ఏపీ అభివృద్ది కోసం పాటు పడ్డారని ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలని అన్నారు .
పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లేనని, రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే కక్ష సాధింపు ధోరణి రాజకీయాలకు తెర తీయడం మంచి పద్దతి కాదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
YSR అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్,పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శంగా ఉండేలా చేశారని తెలిపారు. వైఎస్సార్ ఏదో ఒక పార్టీకి సొంతం కాదని అది తెలుగు వారి ఆస్తి అని అన్నారు.