నా శరీరం కాంగ్రెస్ రక్తం – బండ్ల
నాకు పవన్ కళ్యాణ్ కనిపించే దేవుడు
హైదరాబాద్ – టాలీవుడ్ నిర్మాత, నటుడు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శరీరంలో ప్రవహిస్తోంది కాంగ్రెస్ రక్తం అంటూ చెప్పారు. గబ్బర్ సింగ్ తిరిగి రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు బండ్ల గణేశ్.
తను ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, చివరి దాకా ఉంటానని చెప్పారు. కొన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ జెండా మోస్తానని స్పష్టం చేశారు . ఇదే సమయంలో హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పై స్పందించారు.
ఈ సందర్బంగా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ప్రశంసించారు. ఇదే సమయంలో తన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూల్చేస్తారని, ఇందుకు సంబంధించి తానేమీ తప్పు పట్టనని చెప్పారు బండ్ల గణేశ్.
రాజకీయాలలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, వీడే ప్రసక్తి లేదన్నారు. తన శరీరాన్ని కోస్తే వచ్చే రక్తం కాంగ్రెస్ దేనని పేర్కొన్నారు సినీ నిర్మాత.
ఇదిలా ఉండగా తనకు దేవుడు ఇచ్చిన వరం కొణిదెల పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఆయన తనకు దైవంతో సమానం అని స్పష్టం చేశారు బండ్ల గణేశ్. ప్రస్తుతం నిర్మాత చేసిన వ్యాఖ్యలు సినీ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. తను నిర్మాతగా గబ్బర్ సింగ్ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.