NEWSANDHRA PRADESH

వ‌ర‌ద ప్ర‌భావిత బాధితుల‌కు లోకేష్ భ‌రోసా

Share it with your family & friends

మంగ‌ళ‌గిరిని ముంచెత్తిన వ‌ర్షాలు

అమ‌రావ‌తి – ఏపీలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. మంగళగిరి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఏపీ మంత్రి నారా లోకేష్ ప‌ర్య‌టించారు. మంగళగిరి టౌన్ రత్నాల చెరువు ప్రాంతంలో ముంపు బాధితులతో మాట్లాడారు.

ప్రభుత్వం తరపున అందించిన సాయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మసీదు లైన్‌లో చేనేత కార్మికుల ఇళ్లు పరిశీలించారు. ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటార్లతో తోడించాలని సూచించారు నారా లోకేష్‌.

ముంపు ప్రాంతాల వాసులుకు ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించారు.ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితిపై క్షణక్షణం స‌మీక్షిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ కంట్రోల్ రూమ్ ద్వారా గంట గంటకు పరిస్థితుల గురించి ఆరా తీశారు. తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి వాక‌బు చేశారు నారా లోకేష్. వరద ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు.

వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు. కుండపోత వర్షాలతో గుంటూరు ఛానల్ తెగిపోయి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారన్న విష‌యం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.