ENTERTAINMENT

జే షాపై ప్ర‌కాశ్ రాజ్ సెటైర్

Share it with your family & friends

గ్రేటెస్ట్ లెజెండ్ అంటూ కామెంట్

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర హొం శాఖ మంత్రి త‌న‌యుడు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాపై సెటైర్స్ వేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. ఈ స‌దంద‌ర్బంగా జే షా ఐసీసీ చైర్మ‌న్ గా ఎన్నిక కావ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

ఎలాంటి క్రికెట్ ప‌రంగా ప్ర‌తిభ లేకుండా, మైదానంలో దిగ‌కుండా, ఒక్క ప‌రుగు చేయ‌కుండా , ఫీల్డింగ్ లోకి దిగ‌కుండా, బ్యాట్ ప‌ట్ట‌కుండానే అత్యున్న‌త‌మైన ఐసీసీ చీఫ్ ప‌ద‌విని అలంక‌రించ‌డం ప‌ట్ల విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు ప్ర‌కాశ్ రాజ్.

“గొప్ప లెజెండ్ .. ఒక బ్యాట్స్‌మన్..బౌలర్.. వికెట్ కీపర్.. ఫీల్డర్‌కి అందరం స్టాండింగ్ ఒవేషన్ ఇద్దాం” అని ఎద్దేవా చేశారు.

“గ్రేటెస్ట్ లెజెండ్.. ఒక బ్యాట్స్‌మన్.. బౌలర్.. వికెట్ కీపర్.. ఫీల్డర్.. ఆల్టిమేట్ ఆల్‌రౌండ్ క్రికెటర్.. భారతదేశం కలిగి ఉన్న గొప్ప లెజెండ్‌కు అందరూ నిలబడి నమస్కరిద్దాం. ఎప్పుడో తయారైంది.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు..అంటూ పేర్కొన‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జేషా కు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు కాక పోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . 35 సంవత్సరాల వయస్సులో ఎన్నికైన అతి పిన్న వ‌య‌స్సు క‌లిగిన వ్య‌క్తి కావ‌డం విశేషం.