NEWSANDHRA PRADESH

అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

Share it with your family & friends

టెలి కాన్ఫ‌రెన్స్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆదివారం

భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష చేశారు. డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాల‌ని సూచించారు.

మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్ లలో వచ్చే విజ్ఞప్తులపై తక్ష‌ణ‌మే స్పందించాల‌ని ఆదేశించారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖకు సూచించారు సీఎం.

సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్ కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా. నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందన్నారు.. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయ‌ని తెలిపారు ముఖ్య‌మంత్రి.

రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు….కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు . పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని. ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందన్నారు చంద్ర‌బాబు నాయుడు.

గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలి. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని తెలిపిన మంత్రి నారాయణ. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్న సిఎం

నూజివీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని వివరించిన మంత్రి కొలుసు పార్థసారధి. ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంకు వివరించారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు.

ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ . ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిపివేత, ప్రయాణికులకు సాయంపై వివరించిన జిల్లా కలెక్టర్, డీజీపీ.