ENTERTAINMENT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియ‌ల్ ప‌వ‌ర్ స్టార్

Share it with your family & friends

ద‌మ్మున్నోడు బుల్లెట్ లాంటోడు

హైద‌రాబాద్ – సినీ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా గుర్తింపు పొందారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఓ వైపు సోద‌రులు చిరంజీవి, నాగ బాబు , మెగా ఫ్యామిలీ సినీ రంగంలో కొన‌సాగుతూ ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఫ్యాన్ ఫాలోయింగ్ లో టాప్ లో కొన‌సాగుతూనే మాన‌వ‌త్వాన్ని చాటు కోవ‌డంలో త‌ను వెరీ వెరీ స్పెష‌ల్. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఇటు సినీ రంగంలోనే స‌క్సెస్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..అటు రాజ‌కీయ రంగంలో కూడా టాప్ లో కొన‌సాగుతూ త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించుకున్నాడు.

నిత్యం పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డంలో, ప్ర‌జ‌ల‌ను క‌లుసు కోవ‌డంలో ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంటారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎక్కువ‌గా తాను మాట్లాడేట‌ప్పుడు గొప్ప గొప్ప వ్య‌క్తుల‌ను, మ‌హ‌నీయుల జీవితాల‌ను ఉద‌హ‌రిస్తూ వ‌స్తారు. కార‌ణం ఏమిటంటే అలాంటి వారే ప్ర‌జ‌ల‌ను, స‌మాజాన్ని ఎక్కువ‌గా ప్రభావితం చూపిస్తార‌ని బ‌లంగా న‌మ్ముతారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

చేసిన ప్ర‌తి సినిమాలో ప్ర‌త్యేక‌త ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు ప‌వ‌ర్ స్టార్. అంతే కాదు ఓ బ‌ల‌మైన మెస్సేజ్ ను అందించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. అందుకే సినీ రంగంలో ఎవ‌రికీ, ఏ హీరోకు లేనంత‌గా ప‌వ‌ర్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్.